: ఇండియాకు వీడ్కోలు పలకనున్న హ్యుందాయ్ శాంత్రో


1998లో భారత్ లోకి ప్రవేశించి, మారుతి 800కి ప్రధాన పోటీగా నిలిచిన శాంత్రో కార్ల తయారీని నిలిపివేయాలని హ్యుందాయ్ నిర్ణయించింది. కొరియన్ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ కి ఇండియాలో ఘనమైన గుర్తింపు రావడానికి శాంత్రో కార్లే కారణమైనప్పటికీ, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త మోడల్ కారు రావాలంటే పాత మోడల్స్ ఆపక తప్పదని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ 15 సంవత్సరాల్లో 13.6 లక్షల యూనిట్లను ఇండియాలో, 5.3 లక్షల యూనిట్లను విదేశాల్లో విక్రయించామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News