: దమ్ముంటే రా... నువ్వేంటో నేనేంటో తేల్చుకుందాం: ఎమ్మెల్యే విష్ణు
మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణు, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి మధ్య వివాదం ముదిరిపాకనపడుతోంది. వివాదం నేపథ్యంలో వంశీచంద్ రెడ్డికి ఎమ్మెల్యే విష్ణు సవాలు విసిరారు. గొడవకు దిగాలనుకుంటే హైదరాబాదు నడిబొడ్డునైనా, మహబూబ్ నగర్ జిల్లాలో అయినా తాను సిద్ధమని అన్నారు. తాను హైదరాబాదీనని, పీజేఆర్ కుమారుడినని, చేతనైతే రావాలని విష్ణు సవాలు విసిరారు. పోలీసులు అధికారం ఉంటే ఒకలాగ, అధికారం లేకపోతే ఇంకొకలాగ వ్యవహరిస్తారని ఆయన ఆరోపించారు. తెలంగాణ కోసం పోరాడుతున్నప్పుడు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి తమ్ముడ్నే కొట్టానని ఆయన తెలిపారు. ఇప్పుడైనా ఆయన గొడవకు వస్తే నీ ప్రతాపమూ, నా ప్రతాపమూ చూసుకుందామని ఆయన సవాలు విసిరారు.