: ఆడియో విడుదల వేదికపై దర్శకుడిని రఫ్ఫాడించిన రాఖీ సావంత్ ఫ్రెండ్
తన స్నేహితురాలు రాఖీ సావంత్ నృత్యం చేసిన గీతాన్ని ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తూ, ‘ముంబై కెన్ డాన్స్ సాలా' చిత్ర దర్శకుడు సచ్చీందర్ శర్మను వేదికపై వీర బాదుడు బాదింది మనీషా. నిన్న రాత్రి ఆడియో వేడుక జరుగుతుండగా స్టేజీపైకి దూసుకొచ్చి, దర్శకుడితో వాగ్వివాదానికి దిగిన మనీషా మాటలతో ఆగకుండా దర్శకుడిని లాగి రెండు పీకులు పీకింది. అనంతరం ఆమె మాట్లాడుతూ, సినిమా అవకాశం ఇవ్వాలని అడిగితే లైంగిక పరమైన కోరికలు తీర్చమని ఆయన కోరాడని ఆరోపించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన మనీష ఈ మేరకు దర్శకుడిపై ఫిర్యాదు చేసింది. ఆ వెంటనే స్పందించిన దర్శకుడి భార్య మధు పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, చీప్ పబ్లిసిటీ కోసమే రాఖీ సావంత్, ఆమె ఫ్రెండ్ మనీషా ఈ డ్రామాకు తెరతీసారని, అన్యాయంగా తన భర్తపై చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఇరు పక్షాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.