: ఘర్షణ పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే


వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ నేతలే. ఒకరు ఎమ్మెల్యే కాగా, మరొకరు మాజీ ఎమ్మెల్యే. అందులోను ఇద్దరూ తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే. అయినా ఘర్షణ పడ్డారు. హైదరాబాద్ లోని మాదాపూర్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద కొద్దిసేపటి క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, కల్వకుంట్ల ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఘర్షణ పడ్డారు. తీవ్ర వాగ్వాదం అనంతరం ఒకరినొకరు తోసేసుకున్నారు. అంతటితో ఆగని ఆ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. వీరి మధ్య ఘర్షణ తలెత్తడానికి గల కారణాలు తెలియరాలేదు.

  • Loading...

More Telugu News