: నది మధ్యలో పెళ్లి బృందం... గట్టున ఆందోళనలో బంధువులు


పెళ్లి చేసుకునేందుకు వెళ్లిన వధూవరులతో పాటు వారి సమీప బంధువులు నది మధ్యలో చిక్కుకుపోయారు. నల్లగొండ జిల్లా మఠంపల్లి వద్ద కృష్ణానది మధ్యలో వధూవరులు చిక్కుకుపోవడంతో వారి బంధువర్గం ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఒడ్డున ఆందోళనలో కూరుకుపోయింది. పెళ్లి కోసం గుంటూరు జిల్లా తంగెడకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పెళ్లి బృందం బయలుదేరిన బల్లకట్టు నది మధ్యలో నిలిచిపోయింది. నది మధ్యలో చిక్కుకుపోయిన పెళ్లి బృందాన్ని బయటకు తీసుకువచ్చే చర్యలు ఇంకా ప్రారంభం కాలేదు.

  • Loading...

More Telugu News