: వీణామాలిక్ కు శిక్షపై పాక్ సుప్రీంకోర్టు స్టే


నటి వీణామాలిక్ కు గిల్గిత్-బాల్టిస్తాన్ తీవ్రవాద వ్యతిరేక కోర్టు విధించిన శిక్షపై పాకిస్థాన్ సుప్రీంకోర్టు స్టే విధించింది. తనకు విధించిన శిక్షఫై వీణా దాఖలు చేసిన పిటిషన్ పై ముగ్గురు జడ్జిల ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో దాదాపు గంట పాటు జరిగిన వాదనల అనంతరం శిక్షపై ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో పాక్ అటార్నీ జనరల్ కు నోటిసు జారీచేసి, విచారణను వాయిదా వేసింది. ఓ టీవీ కార్యక్రమంలో దైవ దూషణతో కూడిన కార్యక్రమం ప్రసారం చేశారంటూ వీణా, ఆమె భర్త బషీర్, టివీ వ్యాఖ్యాత షయిష్టా లోధి, ప్రముఖ మీడియా గ్రూప్ యజమాని మీర్ షకీల్ ఉర్ రెహ్మాన్ లకు 26 ఏళ్ల జైలు శిక్ష, రూ.13 లక్షల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News