: సచిన్ కు ‘పీకే’ను చూపించనున్న ఆమిర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తన తాజా చిత్రం పీకేను రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు చూపించనున్నాడు. ఇందుకోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసేందుకు అతడు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆమిర్ కు జోడీగా అనుష్క శర్మ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవలే అనుష్క, ఈ చిత్రాన్ని తన ప్రియుడు, టీమిండియా వైెస్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి చూపిందట. పీకే చిత్రంపై కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడట. ఈ నేపథ్యంలో సచిన్ కూ ఈ చిత్రాన్ని చూపించేందుకు ఆమిర్ నిర్ణయించుకున్నాడు. ఇప్పటికే చిత్రం ప్రమోషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆమిర్ వచ్చే వారం తన చిత్రాన్ని సచిన్ కు చూపించేందుకు దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడట. మరి పీకేపై సచిన్ ఏ విధంగా స్పందిస్తాడో వచ్చేవారం తేలిపోనుందన్నమాట.