: షర్మిల 'ఓదార్పు'లో ఇంతలో ఎంతమార్పు?
వైకాపా అధినేత జగన్ సోదరి, ఆ పార్టీ 'క్రౌడ్ పుల్లర్' అయిన షర్మిల యాత్రలు సాధారణంగా ఓ లెవెల్లో ఉంటాయి. వైరి పక్షాలపై ఆమె సంధించే విమర్శనాస్త్రాలు జనాలను విశేషంగా ఆకట్టుకుంటుంటాయి. గతంలో చేపట్టిన పాదయాత్ర సందర్భంగా, కాంగ్రెస్, టీడీపీలను ఆమె కడిగిపారేశారు. అలాంటిది మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల తాజాగా చేపట్టిన ఓదార్పు యాత్ర చాలా సైలెంట్ గా కొనసాగుతోంది. తన తండ్రి వైయస్ మరణం తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడంతోనే షర్మిల సరిపెట్టుకుంటున్నారు. కేవలం తన తండ్రి అభివృద్ధి పథకాల గురించే మాట్లాడుతూ, యాత్రను కొనసాగిస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లో అధికార పార్టీలైన టీడీపీ, టీఆర్ఎస్ లపై ఆమె ఒక్క విమర్శను కూడా ఎక్కుపెట్టలేదు.