: 'హ్యూస్' ఎఫెక్ట్ కనిపించలేదు... 8 వికెట్లతో నిప్పులు చెరిగిన షాన్ అబాట్


ఆసీస్ బ్యాట్స్ మన్ ఫిలిప్ హ్యూస్ మరణం తాలూకు అపరాధ భావన నుంచి షాన్ అబాట్ పూర్తిగా బయటపడినట్టేనని అర్థమవుతోంది. అబాట్ విసిరిన బౌన్సర్ తగిలి హ్యూస్ ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. కాగా, ఈ 22 ఏళ్ల యువ పేసర్ తాజాగా క్వీన్స్ ల్యాండ్ పై నిప్పులు చెరిగాడు. దీంతో, అతని జట్టు న్యూ సౌత్ వేల్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో అబాట్ మొత్తం 8 వికెట్లు సాధించాడు. క్వీన్స్ లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో అబాట్ కేవలం 14 పరుగులిచ్చి 6 వికెట్లు తీయడం విశేషం. దీంతో, క్వీన్స్ లాండ్ జట్టు 99 పరుగులకే ఆలౌటైంది. అమితమైన వేగానికి టెక్నిక్ మేళవించి అబాట్ విసిరిన బంతులు క్వీన్స్ లాండ్ బ్యాట్స్ మెన్ పాలిట పెనుగండంగా పరిణమించాయి. తాజా ప్రదర్శనతో అబాట్ టీమిండియాతో చివరి రెండు టెస్టులకు చోటు దక్కించుకునే అవకాశాలు మెరుగుపర్చుకున్నాడు.

  • Loading...

More Telugu News