: 1000 వారాలైనా వన్నెతగ్గని 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే'


1995 అక్టోబర్ 20న దేశవ్యాప్తంగా విడుదలై సంచలన విజయం సాధించిన 'దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే' ఇప్పటికీ యువతను ఆకర్షిస్తూనే ఉంది. ఈ చిత్రం 1000 వారాలను పూర్తి చేసుకోనుంది. ముంబై లోని 'మరాఠా మందిర్' సినిమా హాలులో చిత్రం రిలీజ్ అయిన రోజు నుంచి ప్రదర్శింపబడుతూనే ఉంది. ఒక చిత్రం ఇలా సంవత్సరాల తరబడి ఒకే థియేటర్ లో ఆడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. టీనేజ్ యూత్ ను అమితంగా ఆకర్షించే ఈ సినిమాలో షారూక్ ఖాన్, కాజోల్, అనుపమ్ ఖేర్ తదితరులు నటించిన సంగతి తెలిసిందే. కాగా, 1000 వారాల వేడుకలను జరిపేందుకు 'మరాఠా మందిర్' నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, మరోసారి ఈ చిత్రం చూసేందుకు యువత ఉవ్విళ్ళూరుతోంది.

  • Loading...

More Telugu News