: సానియామీర్జాకు భర్తతో గడిపేంత టైమ్ కూడా దొరకడం లేదా?
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాకు తన భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో అంతరం అంతకంతకూ పెరుగుతోందని జాతీయ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి. ఓ ఆంగ్ల దినపత్రిక అయితే ఏకంగా "సానియాకు భర్త షోయబ్ ను కలుసుకునే టైమ్ కూడా దొరకడం లేదా?" అంటూ పెద్ద కథనాన్నే వెలువరించింది. ఢిల్లీలో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారులు రోజర్ ఫెదరర్, బొపన్న తదితరులకు సానియా పార్టీ ఇస్తే... అదే సమయంలో కరాచీలో హుమాయిన్ కుటుంబానికి షోయబ్ పార్టీ ఇచ్చాడట. భార్యాభర్తలిద్దరూ కలుసుకోకుండా పరస్పరం తప్పించుకు తిరుగుతున్నారని సదరు పత్రిక తెలిపింది. ఇద్దరి మధ్య అంతరం అంతకంతకు పెరుగుతోందని అభిప్రాయపడింది. తన రియల్ లైఫ్ 'జేమ్స్ బాండ్' షోయబే అంటూ యాడ్స్ లో కనిపించే సానియా... సదరు పత్రికా కథనానికి ఏం సమాధానం చెబుతుందో?