: సరదా కోసం 37 మంది యువతులను చంపిన సైకో


కేవలం సరదా కోసం 41 మందిని హత్య చేసాడో ఘనుడు. అందులో 37 మంది యువతులు కాగా, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. బ్రెజిల్ లోని రియో పరిసరాల్లో జరిగిన హత్యలో అనుమానం వచ్చి 26 ఏళ్ల ఓ నల్లజాతి యువకుడు సైల్సన్ జోస్ దాస్ గ్రాకస్ ను విచారిస్తే ఈ నిజం వెలుగులోకి వచ్చింది. "అతనికి మహిళలను హత్యచేయాలని కోరిక. అది కూడా తెల్లజాతి వారినే, నల్లజాతి వారిని కాదు. బాధితులను దగ్గరి నుంచి పరిశీలించి సమయం చూసి హత్యచేసేవాడు" అని ఓ పోలీసు అధికారి వెల్లడించారు. అతన్ని ఒక సైకో గా ఆయన అభివర్ణించాడు. కాగా, తాను 17 సంవత్సరాల వయస్సులో తొలి హత్య చేశానని నిందితుడు అంగీకరించాడు. బ్రెజిల్ లో మరణశిక్ష లేకపోవడంతో ఇతనికి గరిష్టంగా 30 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News