: ఆస్తి కోసం కన్న తల్లిని సజీవదహనం చేసిన కసాయి


ఆస్తి రాసివ్వలేదని కన్న తల్లికి నిప్పంటించి సజీవదహనం చేశాడో కసాయి కొడుకు. ఈ హృదయవిదారక సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా, ధన్వాడ మండలం మరికల్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మరికల్ గ్రామ మాజీ సర్పంచ్ ఎస్.సరళ (43)కు, ఆమె కొడుకు హరితేజకు గత కొన్నాళ్లుగా ఆస్తి వివాదం నడుస్తోంది. ఆస్తి తన పేర రాయాలని హరితేజ తల్లితో గొడవ పడుతుంటే ఆమె మాత్రం నిరాకరిస్తుండేది. ఇదే విషయమై వారిద్దరి మధ్య తీవ్రస్థాయలో వాగ్వివాదం జరుగగా, కోపంతో హరితేజ తల్లికి నిప్పంటించాడు. ఆమె అక్కడికక్కడే కాలి బూడిద కాగా, హరితేజకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News