: 'నేటితో నా బ్యాచిలర్ లైఫ్‌ ఎండ్' అంటున్న హీరో ఆది... రేపు అరుణతో వివాహం


"నేటితో నా బ్యాచిలర్ లైఫ్‌కి ఆఖరి రోజు" అంటున్నాడు తెలుగు సినీ హీరో, డైలాగ్ కింగ్ సాయికుమార్ కుమారుడు ఆది. కొంత మంది అప్పుడే పెళ్లేంటి? అని అడిగినా, మరికొంతమంది కరెక్టు టైమ్‌కి భలేగా చేసుకుంటున్నావు అని అభినందించినా, తాను మాత్రం నాన్న చెప్పిన మాటపై నిలబడ్డానని ఆది అంటున్నాడు. "సో... హ్యాపీగా ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా" అని ఆది తెలిపాడు. ప్రేమ కావాలి', ‘లవ్లీ', ‘సుకుమారుడు', ‘గాలిపటం' చిత్రాల్లో నటించిన తెలుగు హీరో ఆది, అరుణ (సాఫ్ట్ వేర్ ఉద్యోగిని)ల వివాహం రేపు జరగనుంది. నటుడు సాయి కుమార్‌కు తెలుగుతో పాటు ఇతర పరిశ్రమల ప్రముఖలతో కూడా పరిచయాలు ఉండటంతో సౌతిండియా నుండి సినీ ప్రముఖులంతా ఈ పెళ్లి వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News