: నేడు కర్నూలుకు వీహెచ్ పీ నేత ప్రవీణ్ తొగాడియా
విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వీహెచ్ పీ నిర్వహించిన విరాట్ హిందూ శంఖారావం కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. నేడు కర్నూలులో వీహెచ్ పీ నిర్వహించనున్న కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఉద్రేకపూరిత ప్రసంగాలకు నెలవైన తొగాడియా, నిన్నటి పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్ వైఖరిపై నిప్పులు చెరిగారు. హిందువులను అణచివేయాలని చూస్తే మరో సర్దార్ పటేల్ వస్తారంటూ ఆయన హెచ్చరికలు జారీ చేశారు.