: తొలి ఇన్నింగ్స్ లో 444 కు భారత్ ఆలౌట్
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 444 పరుగులు చేసింది. కొద్దిసేపటి క్రితం భారత్ ను ఆలౌట్ చేసిన ఆసిస్ తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. తొలి టెస్టు నాలుగో రోజుకు చేరడంతో ఈ టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ లో భారత్ పై ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్ లోనూ భారీ ఆధిక్యం సాధించాలన్న పట్టుదలతో ఉంది. తొలి రోజు ఆస్ట్రేలియాపై కాస్తంత ప్రభావం చూపిన భారత బౌలర్లు, రెండో రోజు చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో నేటి ఆట కీలకం కానుంది. తొలి ఇన్నింగ్స్ లో ముగ్గురు ఆసిస్ ఆటగాళ్లు సెంచరీలు చేయగా, భారత్ తరపున కోహ్లీ ఒక్కడే శతకం చేశాడు.