: 'ఓ చందమామ...ఓ చందమామ...ఓ చందమామ' అంటూ నవ్వులు పూయించిన వెంకయ్యనాయుడు


లోక్ సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నవ్వుల పూవులు పూయించారు. మతమార్పిళ్లపై చర్చ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ వాదనను సీరియస్ గా సమర్ధవంతంగా వినిపించారు. మధ్య మధ్యలో ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల తీరు ఎలా ఉందంటే "నేను చిన్నతనంలో ఉండగా హెచ్ఎంవీ వారి గ్రామ్ ఫోన్ రికార్డులు ఉండేవి. వాటిల్లో పాటలు వినేవాడిని. అవి పాడైపోతున్న దశలో పాట మధ్యలో స్టక్ అయిపోయి 'ఓ చందమామ...ఓ చందమామ...ఓ చందమామ' అంటూ అదే మాట పదే పదే రిపీట్ అయ్యేది" అన్నారు. దీంతో అప్పటి వరకూ సీరియస్ గా ఆయన వాదనను వింటున్న లోక్ సభ ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సహా అందరూ నవ్వడంతో తాను సరదాగా చెప్పడంలేదని, ప్రతి పక్షాలు పాడిన పాటే పాడుతూ అసహనానికి గురి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News