: కావలి మున్సిపల్ ఛైర్మన్ కు హైకోర్టులో చుక్కెదురు
పార్టీ ఫిరాయింపుదారులను న్యాయస్థానాలు శిక్షిస్తున్నాయి. ప్రజల మద్దతుతో విజయం సాధించిన తరువాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతూ ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకంపై దెబ్బకొడుతున్న ఫిరాయింపు దారులకు న్యాయస్థానాల నిర్ణయాలు చెంపపెట్టులా మారుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయిన అలేఖ్య, తరువాత పార్టీ మారారు. దీంతో ఆమెను కావలి ఆర్డీవో అనర్హురాలిగా ప్రకటించారు. తన అనర్హతపై స్టే విధించాలంటూ ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో న్యాయస్థానం స్టే విధించింది. దీనిపై వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఆమెపై విధించిన స్టే ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె అర్హతపై 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది.