: 3,50,000 లీటర్ల ఆయిల్ నీటిపాలు
బంగ్లాదేశ్ లోని సుందర్బన్ లోని షేలా నదిలో చమురు ట్యాంకర్ మునిగిపోయింది. ఈ ట్యాంకర్ లో సుమారు 3,50,000 లీటర్ల ఆయిల్ ఉందని అధికారులు తెలిపారు. కాగా, ఈ మొత్తం చమురు వృధాగా నీటిలో కలిసిపోయింది. నీటిలో కలిసే లక్షణం లేని చమురు నదిపై తెట్టులా తేలిపోయింది. దీంతో షేలా నదిలో నీటికి బదులు నూనె ప్రవహిస్తున్నట్టు కనబడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మత్స్య సంపదకు నష్టం వాటిల్లకుండా తెట్టులా తేలిన చమురును తెడ్లతో ఒడ్డున వేస్తున్నారు. ఆయిల్ నీటిలో కలుస్తున్న కారణంగా నీరు కలుషితమై మత్స్య సంపదకు తీరని నష్టం వాటిల్లుతోంది.