: అలిపిరి వద్ద బాంబు కలకలం... విస్తృత తనిఖీలు


పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని అలిపిరి వద్ద బాంబు పేలొచ్చనే సమాచారంతో కలకలం రేగింది. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స వెళ్లిన కొన్ని గంటల్లోనే అలిపిరి వద్ద బాంబు పేలే అవకాశముందని సమాచారం రావడంతో అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు రహస్యంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్రవాదులు, మావోయిస్టులు బాంబు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అలిపిరి వద్ద బాంబులు పేలే ప్రమాదం ఉందని, తమకు విశ్వసనీయ సమాచారం ఉందని కర్ణాటక డీజీపీ ఆంధ్రప్రదేశ్ పోలీసులను హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన ప్రతి వస్తువునూ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News