: ఉబెర్ కామాంధుడికి జ్యుడీషియల్ రిమాండ్


గమ్యం చేరాలనుకుని క్యాబ్ ఎక్కిన పాపానికి ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు శివ్ కుమార్ యాదవ్ ని న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించింది. ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివ్ కుమార్ యాదవ్ కు ఢిల్లీ న్యాయస్థానం డిసెంబర్ 24 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఉబెర్ క్యాబ్ కు చెందిన డ్రైవర్ శివ్ కుమార్ యాదవ్ ఈ నెల 10న తన క్యాబ్ ఎక్కిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. 2011లో కూడా శివ్ కుమార్ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని వ్యవహారశైలిపై పూర్తి నివేదిక సమర్పించిన పోలీసులు, అతనిని కస్టడీకి కోరారు. దీంతో, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

  • Loading...

More Telugu News