: 'అత్యవసర' నిబంధనలపై ఇందిరకు అవగాహన లేదు: ప్రణబ్ ముఖర్జీ
'ద డ్రమాటిక్ డికేడ్: ద ఇందిరా గాంధీ ఇయర్స్' పేరుతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన పుస్తకం విడుదలైంది. ఇందులో ప్రణబ్ వెల్లడించిన విషయాలు కలకలం రేపుతున్నాయి. 1975లో అత్యవసర పరిస్థితి విధించడానికి సంబంధించిన రాజ్యాంగ నిబంధనలపై మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అవగాహన లేదని పేర్కొన్నారు. కేవలం పశ్చిమబెంగాల్ మాజీ సీఎం సిద్ధార్థ్ శంకరే సూచన మేరకే ఎమర్జెన్సీని విధించినట్టు చెప్పారు. ఈ విషయంలో ఆయనే ప్రముఖ పాత్ర పోషించారని వెల్లడించారు. దానిపై తనకు అవగాహన లేదని ఇందిరాగాంధీ తరువాత తనకు చెప్పారన్నారు. ప్రణబ్ తన పుట్టినరోజు సందర్భంగా ఆ పుస్తకాన్ని ఈరోజు విడుదల చేశారు.