: 'లింగ'కు కోర్టులో ఎదురుదెబ్బ... రూ.10 కోట్లు కట్టాలని నిర్మాతకు ఆదేశాలు


రజనీకాంత్ హీరోగా నిర్మితమైన 'లింగ' చిత్రానికి సివిల్ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వర్ధమాన ఫిలింమేకర్ రవిరత్నం వేసిన పిటిషన్పై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం, శుక్రవారం మధ్యాహ్నంలోగా రూ.10 కోట్లు కట్టాలని చిత్ర నిర్మాతను ఆదేశించింది. లేకుంటే చిత్ర ప్రదర్శన ఆపాల్సి ఉంటుందని హెచ్చరించింది. రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం ప్రపంచవ్యాప్తంగా 'లింగ' విడుదలకానున్న సంగతి తెలిసిందే. కాగా, కోర్టు ఆదేశాన్ని తాము గౌరవిస్తామని చిత్ర నిర్మాత రాక్లైన్ వెంకటేష్ తెలిపారు. కోర్టు కోరినట్టుగా డబ్బు కడతామని, సినిమా ముందుగా అనుకున్నట్లుగానే విడుదల అవుతుందని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News