: సీఎం రిలీఫ్ ఫండ్ కు శ్రీనివాస ట్రస్టు రూ.2 కోట్ల భారీ విరాళం!


మాజీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ డీకే ఆదికేశవులునాయుడు కుటుంబం ఆధ్వర్యంలోని శ్రీనివాస ట్రస్టు నేడు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాన్ని అందజేసింది. రైతు సాధికారత సదస్సు ప్రారంభోత్సవం కోసం చిత్తూరు నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబునాయుడుకు రూ.2,04,17,000 చెక్కును దివంగత డీకే ఆదికేశవులునాయుడు సతీమణి, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ అందజేశారు. దానగుణంలో తనదైన శైలిలో పలువురిని ఆదుకున్న డీకే ఆదికేశవులునాయుడు రెండేళ్ల క్రితం మరణించారు. ఆయన జ్ఞాపకార్థం శ్రీనివాస ట్రస్టు తరఫున సత్యప్రభ ఈ భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు.

  • Loading...

More Telugu News