: మెట్రో రైలు వద్దంటూ కోఠిలో విద్యార్థినుల ఆందోళన


మెట్రో రైలు వస్తే ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని జంటనగరాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటే, కోఠి ఉమెన్స్ కాలేజీ విద్యార్థినులు మాత్రం ఆందోళనకు దిగారు. ఎందుకంటే, కోఠిలోని సుల్తాన్ బజార్ మీదుగా వెళ్ళాల్సిన మెట్రో రైలు మార్గాన్ని చుట్టూ తిప్పి ఉమెన్స్ కాలేజీ క్యాంపస్ నుంచి బస్టాండ్ వైపు వెళ్ళేలా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తమ కాలేజీ క్యాంపస్ లో నుంచి మెట్రో లైన్ వెళ్లకూడదంటూ నేటి ఉదయం విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. దాంతో ఆ మార్గంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

  • Loading...

More Telugu News