: జమ్ము కాశ్మీర్ లో రక్షణ మంత్రి తొలి పర్యటన


కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మనోహర్ పారికర్ తొలిసారిగా నేడు జమ్ము కాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఆయన, డిసెంబర్ 5న యూరి శిబిరంపై జరిగిన దాడిలో లెఫ్టినెంట్ కల్నల్ సహా ప్రాణాలు వదిలిన ఎనిమిది మంది సైనికులకు నివాళులర్పించారు. తరువాత కాశ్మీర్ వ్యాలీలో శాంతి భద్రతలపై, నియంత్రణ రేఖ వద్ద పరిస్థితులపై ఆర్మీ సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. ఇటీవల నియంత్రణ రేఖ వద్ద యూరీ సెక్టార్ లోని ఆర్మీ క్యాంప్ లో ఆత్మాహుతి దళాల దాడులు, పలు సంఘటనల అనంతరం పారికర్ ఇక్కడ పర్యటిస్తున్నారు.

  • Loading...

More Telugu News