: ఆదాయపన్ను కేసులో జయలలిత పిటిషన్ తిరస్కరణ


ఆదాయపన్ను కేసులో ఏఐఏడీఎంకే అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఈ కేసులో తనకు విధించిన శిక్షపై ముందుగా విచారించాలంటూ జయ తరపు న్యాయవాది పిటిషన్ వేశారు. ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న జయకు ఈ ఏడాది సెప్టెంబర్ లో బెంగళూరు ట్రయల్ కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. డిసెంబర్ 18లోగా ఈ కేసుకు సంబంధించిన పత్రాల సమర్పణను పూర్తి చేయాలని కూడా తెలిపింది. ఈ క్రమంలో ఇటీవలే కేసుకు సంబంధించి పత్రాలన్నింటినీ కర్ణాటక హైకోర్టుకు సమర్పించినట్టు న్యాయవాది ఫాలి నారిమన్ తెలిపారు. అయితే, కేసులో ముందుగానే విచారణ ఎందుకు చేపట్టాలో మాత్రం చెప్పలేదు.

  • Loading...

More Telugu News