: హాఫ్ సెంచరీలు చేసిన రహానే, కోహ్లీ... భారత్ 316/4


అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో 517 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసిన ఆస్ట్రేలియాకు టీమిండియా దీటుగా సమాధానమిస్తోంది. కోహ్లీ, రహానేలు హాఫ్ సెంచరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. 62 పరుగుల (10 ఫోర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద లియాన్ బౌలింగ్ లో వాట్సన్ కు క్యాచ్ ఇచ్చి రహానే వెనుదిరిగాడు. మరోవైపు, కోహ్లీ 10 ఫోర్లతో 88 పరుగులు చేసి శతకం వైపు దూసుకుపోతున్నాడు. రోహిత్ శర్మ 9 పరుగులతో ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 316 పరుగులు.

  • Loading...

More Telugu News