: లెనోవో నుంచి వాయిస్ కాలింగ్ ట్యాబ్... ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభ్యం


చైనా కంప్యూటర్ దిగ్గజం లెనోవో తాజాగా వాయిస్ కాలింగ్ సౌకర్యంతో ఎస్8 ట్యాట్లెట్ ను లాంచ్ చేసింది. ఈ ఆండ్రాయిడ్ ఆధారిత ట్యాబ్ ధర రూ.16,900. అయితే, ఈ ట్యాబ్ సుప్రసిద్ధ ఆన్ లైన్ పోర్టల్ ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే లభ్యమవుతుంది. ఈ ట్యాబ్ 4జీ ఎల్టీఈ నెట్ వర్క్స్ తో కూడా పనిచేస్తుంది. 8 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్, ఐపీఎస్ డిస్ ప్లే, 64-బిట్ 1.86 గిగా హెర్ట్ జ్ ఇంటెల్ ఆటమ్ జెడ్3745 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ అంతర్గత మెమరీ (64 జీబీ వరకు పెంచుకోవచ్చు) ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఈ ట్యాబ్ లో, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 1.6 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,290 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. వై-ఫై, బ్లూటూత్ 4.0 సహితమైనదీ సరికొత్త ట్యాబ్.

  • Loading...

More Telugu News