: కేదారేశ్వర ఆశ్రమంలో భారీ చోరీ


తెలుగు రాష్ట్రాల్లో దొంగతనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. జనావాసాల్లోనే కాకుండా, గుళ్లు, గోపురాలు, ఆశ్రమాలను కూడా వదలట్లేదు చోరాగ్రేసులు. తాజాగా నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కేదారేశ్వర ఆశ్రమంలో భారీ చోరీ జరిగింది. ఆశ్రమంలో కొలువైన పంచలోహ విగ్రహంతో పాటు కిరీటం, బంగారు ఆభరణాలను దొంగిలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. నిర్వాహకులు చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News