: 2018లోగా నవ్యాంధ్ర రాజధాని తొలి దశ పూర్తి: సీఆర్డీఏ స్పెషల్ కమిషనర్ శ్రీకాంత్


నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని తొలి దశ నిర్మాణం 2018లోగా పూర్తి కానుంది. ఈ మేరకు కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) స్పెషల్ కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు. ఓ ప్రైవేట్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన రాజధాని నిర్మాణం, విదేశీ సంస్థల సహాయ సహకారాలను సవివరంగా వెల్లడించారు. ఈ నెల 18న అమలులోకి రానున్న సీఆర్డీఏ చట్టం ప్రకారం రాజధాని పరిధిలోని గ్రామాలన్నీ నోటిఫై అవుతాయని శ్రీకాంత్ చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం ఎంత భూమి తీసుకుంటామన్న విషయంపై సీఆర్డీఏ చట్టం స్పష్టత ఇస్తుందన్నారు. సింగపూర్ తరహా రాజధాని అంటే, సింగపూర్ నగరంలోని నిర్మాణాల లాగా కాదని, సింగపూర్ సాంకేతిక సహకారంతో జరిగే నిర్మాణాలని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

  • Loading...

More Telugu News