: లంచ్ విరామానికి ముందే టీమిండియా రెండో వికెట్ డౌన్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో రోజు లంచ్ విరామానికి ముందు భారత్ రెండు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ (53) అర్ధ సెంచరీ సాధించిన తర్వాత మిచెల్ జాన్సన్ బౌలింగ్ లో బ్రాడ్ హాడిన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందే శిఖర్ ధావన్ కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ (3), ఛటేశ్వర్ పుజారా (34) ఉన్నారు. ఏడు ఓవర్లకే తొలి వికెట్ కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను ఓపెనర్ మురళీ విజయ్ ఆదుకున్నా, అతడు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు.