: నేడు మహబూబ్ నగర్ జిల్లాకు వీహెచ్ పీ నేత ప్రవీణ్ తొగాడియా రాక
విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) చీఫ్ ప్రవీణ్ తొగాడియా నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. విరాట్ హిందూ శంఖారావం పేరిట మహబూబ్ నగర్ లో జరగనున్న సభలో ఆయన పాల్గొననున్నారు. కేంద్రంలో బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ భావజాలంతో కొనసాగుతున్న ఆరెస్సెస్, వీహెచ్ పీ తరహా సంస్థలు తమ ప్రాబల్యాన్ని పెంచుకునే దిశలో పలు కార్యక్రమాలను చేపడుతున్నాయి. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ లో విరాట్ హిందూ శంఖారావం సభ జరుగుతోంది. ప్రవీణ్ తొగాడియా పాల్గొంటున్న నేపథ్యంలో భారీ ఎత్తున వీహెచ్ పీ కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యే అవకాశాలున్నాయి.