: నేడు కృష్ణా, గుంటూరు జిల్లాల అధికారులతో సింగపూర్ ప్రతినిధుల భేటీ
నవ్యాంధ్ర రాజధాని మాస్టర్ ప్లాన్ ను అందించేందుకు ఒప్పుకున్న సింగపూర్ ప్రతినిధి బృందం నేడు కృష్ణా, గుంటూరు జిల్లా అధికారులతో భేటీ కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఈ సమావేశం సుదీర్ఘంగా సాగనుంది. రాజధాని నిర్మాణానికి సంబంధించి అధ్యయనం చేసేందుకు వచ్చిన సింగపూర్ బృందం బుధవారం రాజధాని కోసం ఎంపిక చేసిన తుళ్లూరు సమీప ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. నేటి మారథాన్ భేటీలో భాగంగా మాస్టర్ ప్లాన్ కు సంబంధించి సింగపూర్ ప్రతినిధి బృందం రెండు జిల్లాల అధికారులతో చర్చించనుంది.