: రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన గవర్నర్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై గవర్నర్ కేంద్ర మంత్రికి వివరించనున్నారు. గవర్నర్ తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, పలు కీలక సందర్భాల్లో గవర్నర్ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని ఏపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆయన రాజ్ నాథ్ సింగ్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.