: హరీశ్ రావుపై సీఎం కేసీఆర్ పొగడ్తల వర్షం
తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాశానికెత్తేశారు. సిద్దిపేటలో ఎన్నో ఆణిముత్యాలున్నాయని అందులో హరీశ్ ఒక ఆణిముత్యమని ప్రశంసించారు. సిద్దిపేటకు సాగునీరు అందించే బాధ్యత హరీశ్ దేనని అన్నారు. ఆయన మంచి వ్యూహకర్త అని, ఎలాగైనా నిధులు తెస్తారని కితాబిచ్చారు. సిద్దిపేటలో ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగానే సీఎం పైవిధంగా మాట్లాడారు. కాగా, సిద్దిపేటను జిల్లాగా మారుస్తామని, రైలు, సాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తామని ప్రజలపై వరాల జల్లు కురిపించారు.