: రావుల, ఎర్రబెల్లిపై నాంపల్లి కోర్టులో ఫిర్యాదు


తెలంగాణ టీడీపీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులపై ఓ న్యాయవాది నాంపల్లి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. వారిద్దరూ తెలంగాణ రాష్ట్ర చిహ్నాలను అవమానించేలా మాట్లాడారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయవాది ఆరోపణలను విచారణకు స్వీకరించిన నాంపల్లి కోర్టు వారిద్దరిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసు నమోదయ్యే అవకాశాలున్నాయి. కాగా, జనవరి 12 లోగా దర్యాప్తు నివేదిక అందజేయాలని న్యాయస్థానం పోలీసులకు సూచించింది.

  • Loading...

More Telugu News