: ప్రియాంకా చోప్రాకు బాగా కోపం వచ్చింది!


మీరసలు మగాళ్లేనా? అంటూ బాలీవుడ్ అందాల భామ ప్రియాంక చోప్రా మగాళ్లపై అంతెత్తున లేచింది. అంత కోపానికి కారణం ఏంటంటే... సినిమాల్లోని ఐటెం సాంగ్స్ లో నర్తించే వారినందరినీ వ్యభిచారిణులుగా గుర్తించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఓ సంస్థ ప్రకటించింది. కేవలం ఐటెం సాంగ్స్ లో నర్తించే హీరోయిన్లు ఒంటిపై చిన్న, సన్నని వస్త్రాలు ధరించి అంగాగ ప్రదర్శనలు చేస్తారని, అలా చేసేందుకు కోట్లలో పారితోషికం అందుకుంటున్నారని ఆ సంస్థ తెలిపింది. రికార్డింగ్ డాన్సుల్లో నర్తించేవారిని వ్యభిచారిణులుగా అరెస్టు చేస్తున్నప్పుడు, సినిమాల్లో డబ్బు కోసం ఐటెం సాంగ్స్ లో నర్తిస్తూ, కోట్లాది మందిని రెచ్చగొట్టేలా డ్రెస్సులు వేసుకుంటున్న హీరోయిన్లను ఎందుకు వ్యభిచారిణులు అని అనకూడదని సదరు సంస్థ ప్రశ్నించింది. దీంతో ప్రియాంక చోప్రాలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్త్రీలపై అఘాయిత్యాలను ఖండించాల్సింది పోయి, అర్ధం లేకుండా మాట్లాడతారా? అంటూ ప్రియాంక చోప్రా మండిపడింది. కేవలం స్కర్టులు వేసుకోవడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయనడం అమానుషం అని పేర్కొంది. కామాంధుల చర్యలను తప్పుబట్టడం మానేసి, మహిళల వస్త్రధారణను వేలెత్తి చూపుతారా? మీరసలు మగాళ్లేనా? అంటూ సదరు సంస్థపై మండిపడ్డారు. ఈ విషయంలో తాను కూడా కోర్టుకు వెళతానని ఆమె పేర్కొన్నారు. ఐటెం సాంగ్స్ లో నర్తించడం వ్యభిచారం ఎలా అవుతుందో తాను కూడా తేల్చుకుంటానని ఆమె ప్రతినబూనారు. ఇలా మహిళలపై బాధ్యత లేకుండా కామెంట్లు చేసే మగాళ్లంతా లంగాలు కట్టుకుని తిరిగేలా ఆజ్ఞాపించాలని న్యాయస్థానాన్ని కోరతానని ప్రియాంక చెప్పింది.

  • Loading...

More Telugu News