: కేసీఆర్ ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య హెచ్చరికలు
తెలంగాణ విద్యార్థులకు 8 రోజుల్లోగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించాలని బీసీ సంఘాల నేత, టీడీపీ ఎంఎల్ఏ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుంటే, పరీక్షలు జరగనివ్వబోమని, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వానికి రూ.12 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉందని, అయినా రూ.12 కోట్ల మేర విద్యార్థుల బకాయిలు చెల్లించలేకపోవడం శోచనీయమని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు ప్రధాని వద్దకు అఖిలపక్షాలను తీసుకెళ్లాలని కృష్ణయ్య ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.