: సిద్దిపేటలో పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన
మెదక్ జిల్లా సిద్దిపేట చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.6 కోట్లతో నిర్మించే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు, సిద్దిపేట కోమటిచెరువుపై ఆయన ఏరియల్ సర్వే చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నీటిపారుదల శాఖ ఇంజినీర్లు అంతా సిద్దిపేట నీటి పథకాన్ని ఒకసారి పరిశీలించాలన్నారు. ఈ నీటిపథకాన్ని ముందుగా తానే అంచనా వేసి తరువాత ఇంజినీర్లకు అప్పజెప్పానని చెప్పారు. ఈ ప్రాంతంలో గతంలో తీవ్రమైన నీటి సమస్య ఉండేదని, చాలా ఇబ్బందులను అధిగమించి 16 ఏళ్ల క్రితం తాగునీటిని తెచ్చామని వివరించారు. సిద్దిపేట ప్రాంతం ఎత్తులో ఉంది కనుక, నీళ్లు వచ్చేందుకు పలు ఇబ్బందులున్నాయని తెలిపారు. ప్రస్తుత నీటిపథకంతో 180 గ్రామాలకు తాగునీరు అందుతుందని కేసీఆర్ వెల్లడించారు.