: దొంగ సర్టిఫికెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్


వివిధ యూనివర్శిటీల పేరిట దొంగ సర్టిఫికెట్లు అమ్ముతున్న వ్యక్తిని విశాఖ పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మురళీకృష్ణ అనే వ్యక్తి మామిడి గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరిట ఓ సంస్థ నడుపుతున్నాడు. ఉన్నతవిద్యను అభ్యసించాలని భావించే వారిపై వల విసురుతూ, విశ్వవిద్యాలయాల ధ్రువపత్రాలను అక్రమంగా సంపాదించి తెచ్చి విక్రయిస్తుంటాడు. ఇతనిపై వచ్చిన ఫిర్యాదులకు స్పందించి, మామిడి గ్లోబల్ ఎడ్యుకేషన్ పై దాడులు చేయగా, 11 విశ్వవిద్యాలయాల ధ్రువపత్రాలు లభించాయి. ఇప్పటికే వీటిని 400 మందికి విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్టు వివరించారు. మురళీకృష్ణకు సహకరించిన విశ్వవిద్యాలయాల ఉద్యోగులు ఎవరన్న విషయంపైనా విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News