: సింహాద్రి అప్పన్న చెల్లెలికి సరికొత్త ఆలయం
సింహాద్రి అప్పన్న చెల్లెలిగా, ఉత్తరాంధ్ర ప్రజల పూజలందుకునే పైడితల్లి అమ్మవారికి సరికొత్త ఆలయ నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరిగింది. సింహాచలం అనుబంధ దేవాలయమైన పైడితల్లి అమ్మవారి పురాతన ఆలయం స్థానంలో కొత్త ఆలయ పునర్నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.25 లక్షల అంచనా వ్యయంతో ఆలయ పునర్నిర్మాణానికి నడుం బిగించామని ఈ సందర్భంగా మంత్రి గంటా తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.