: ఆరు నెలలైనా ఐపీఎస్ పోస్టులు భర్తీ చేయలేదు: రాజ్యసభలో కేకే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరు నెలలైనా ఐపీఎస్ ఆధికారుల ఖాళీలను భర్తీ చేయడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు రాజ్యసభలో ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఐపీఎస్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేకే ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రెజిబు సమాధానమిస్తూ, ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం రాగానే తెలంగాణకు ఐపీఎస్ అధికారుల కేటాయింపుపై స్పష్టత ఇస్తామని చెప్పారు.