: కృష్ణానదిలో జానకిరామ్ అస్థికల నిమజ్జనం
మూడు రోజుల క్రితం ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ అస్థికలను పవిత్ర కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. నేటి ఉదయం మహబూబ్ నగర్ జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపంలో కృష్ణానది వద్దకు చేరుకున్న జానకిరామ్ బంధువులు అస్థికలకు శాస్త్రోక్తంగా ఉత్తరక్రియలు నిర్వహించారు. ఆ తరువాత జానకిరామ్ కుమారుడు తారక రామారావు చేతుల మీదుగా అస్థికలను నిమజ్జనం చేయించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తదితరులు పాల్గొన్నారు.