: మోదీపై వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పిన తృణమూల్ ఎంపీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ క్షమాపణ చెప్పారు. ఈ మేరకు లోక్ సభలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్టు సదరు ఎంపీ ప్రకటించారు. ఎవరినీ బాధించాలన్న ఆలోచన తనకు లేదన్నారు. మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఇతర నేతలను, ప్రజల నిర్ణయాన్ని ఎంపీలు గౌరవించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో సభ్యులందరినీ కోరారు. పశ్చిమబెంగాల్లో ఇటీవల ఓ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రిపై బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నిన్న (మంగళవారం) డిమాండ్ చేశాయి. లేకుంటే ఎంపీపై అభిశంసన తీర్మానం పెడతామని కూడా హెచ్చరించారు.