: ఆ భారీ గ్రహ శకలంతో ముప్పులేదు: నాసా
అంతరిక్షంలో రష్యా శాస్త్రవేత్తలు గుర్తించిన భారీ గ్రహ శకలంతో భూమండలానికి ముప్పేమీ ఉండదని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' తెలిపింది. 400 మీటర్ల పొడవున్న ఈ శకలానికి రష్యన్ పరిశోధకులు ఆస్టరాయిడ్ 2014 యూఆర్116 అని నామకరణం చేశారు. ఇది భూమి దిశగా దూసుకువస్తోందని పేర్కొన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 27న కిస్లోవోద్ స్క్ లోని మాస్టర్-2 అబ్జర్వేటరీ నుంచి దీన్ని గుర్తించారు. దీనిపై నాసా వర్గాలు స్పందిస్తూ, దానితో భూమికి ప్రమాదం ఉండదని, దాని కక్ష్యా మార్గం భూమికి దూరంగా ఉందని వివరించాయి. 150 ఏళ్ల వరకు అది భూమిని సమీపించే అవకాశాల్లేవని తెలిపింది.