: కప్పట్రాళ్ల కేసులో కోట్ల చక్రపాణిరెడ్డి, చెరుకుపాటి నారాయణరెడ్డి నిర్దోషులు


రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలుగుదేశం పార్టీ నేత కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో వైకాపా నేత చక్రపాణిరెడ్డి, చెరుకులపాటి నారాయణరెడ్డిలను ఆదోని సెషన్స్ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2008లో జరిగిన కప్పట్రాళ్ల హత్య కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి సోదరుడు చక్రపాణి రెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు చెరుకులపాటి నారాయణరెడ్డిలు ప్రధాన నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. కప్పట్రాళ్ల హత్య సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోట్ల చక్రపాణిరెడ్డి అనంతర కాలంలో వైకాపాలో చేరారు. కప్పట్రాళ్ల హత్య కేసుతో తనకెలాంటి సంబంధం లేదని కోట్ల చక్రపాణిరెడ్డి గతంలోనే ప్రకటించారు.

  • Loading...

More Telugu News