: మికా సింగ్ మెడలో హారం తీసి పారిస్ హిల్టన్ కు గిఫ్టుగా ఇచ్చిన సల్మాన్
పాప్ గాయని, నటి పారిస్ హిల్టన్ విలువైన బహుమతి అందుకుంది. వెంకటేశ్వర హ్యాచరీస్ యజమాని బాలాజీ రావు బర్త్ డే పార్టీకి పూణే విచ్చేసిన ఆమెకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఖరీదైన డైమండ్ నెక్లెస్ ప్రెజెంట్ చేశాడు. సిక్కుల పవిత్ర ముద్ర 'సింగ్ ఖాందా' ఉన్న ఆ వజ్రాల హారం ఖరీదు కళ్లు తిరిగే రేంజిలో ఉంటుందని బాలీవుడ్ వర్గాల టాక్. అయితే, ఆ హారం ఇండీ పాప్ గాయకుడు మికా సింగ్ కు చెందినది. పార్టీ కొనసాగుతోండగా, మికా మెడలోంచి ఆ హారాన్ని తీసిన సల్మాన్ ఖాన్... దాన్ని పారిస్ హిల్టన్ మెడలో వేశాడు. దీనిపై, పారిస్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపింది. సల్మాన్, మికా ఎంతో మంచివారని కొనియాడింది.