: తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ కు డిమాండ్


తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడంపై తెలంగాణ డీఎస్సీ అభ్యర్థుల సంఘం తెరపైకి వచ్చింది. ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతో సంబంధం లేకుండా వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేసింది. దానికోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ టీచర్ల జేఏసీని డీఎస్సీ అభ్యర్థుల సంఘం కోరింది. ఈ మేరకు జేఏసీ ఛైర్మన్ వెంకటరెడ్డికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది. ఉపాధ్యాయుల రేషనలైజేషన్ పేరుతో నోటిఫికేషన్ జారీలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని సంఘం తెలిపింది. కాగా, ఇప్పటికే ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News