: ఆస్తుల వెల్లడికి నేడే చివరి రోజు: ఎంపీలకు బీజేపీ వార్నింగ్


వ్యక్తిగత ఆస్తుల వెల్లడికి సంబంధించి బీజేపీ, తన ఎంపీలకు మరోమారు గట్టి హెచ్చరికను జారీ చేసింది. పార్టీకి చెందిన ప్రతి ఎంపీ తమ ఆస్తులను స్వచ్ఛందంగా వెల్లడించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే. ప్రధాని ఆదేశాల మేరకు ఆ గడువు నేటితో ముగియనుంది. గడువు ముగుస్తున్న నేపథ్యంలో నిన్నటి భేటీలో పార్టీ సీనియర్లు దీనిపై చర్చించారు. నిర్ణీత గడువులోగా ఆస్తులు వెల్లడించని ఎంపీలపై కఠిన చర్యలు తప్పవని మోదీ హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్య నేతలు పార్టీ ఎంపీలకు గుర్తు చేశారు. సుపరిపాలన దిశగా అడుగులేస్తున్న ప్రధాని మోదీ, అటల్ బిహారీ వాజ్ పేయ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న సుపరిపాలన దినంగా పాటించనున్నారు. ఈలోగానే పార్టీ ఎంపీలు ఆస్తులను వెల్లడించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ‘‘ఇప్పటికే చాలా మంది ఎంపీలు తమ ఆస్తులను వెల్లడించారు. ఇంకా కొంతమంది తమ ఆస్తులను వెల్లడించలేదు. ఈ రోజు సాయంత్రం లోగా వారు తమ ఆస్తుల చిట్టాను అందజేస్తారనుకుంటున్నాను’ అంటూ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News